News

హైందవ శంఖారావం సభ విజయవంతానికి పిలుపు

263views

హిందూ దేవాలయాల పరిరక్షణకు విజయవాడలో నిర్వహించనున్న హైందవ శంఖారావం బహిరంగ సభకు హిందువులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయ వంతం చేయాలని విశ్వహిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ సహ ప్రాంత ప్రచారక్ జనార్దన్ పిలుపునిచ్చారు. ఏలూరులోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన హైందవ శంఖారావం సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. హిందూ ఆలయాల్లో హిందువులు మాత్రమే పని చేయాలని, ఇతర మతాలకు చెందిన ఉద్యోగులను వెనక్కి పంపాలనే డిమాండుతో వచ్చే ఏడాది జనవరి 5న హైందవ శంఖారావం సభ నిర్వ హిస్తున్నామన్నారు. గ్రామాల్లో కమిటీలు ఏర్పాటుచేసి వాటి ద్వారా పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు వచ్చేలా చూడాలన్నారు. హైందవ శంఖారావం నాయకులు కస్తూరి సూర్యప్రకాష్, మేడిశెట్టి పాములు, పవన్, హిందూ సంఘాల ప్రతినిధులు, విశ్వ హిందూ పరిషత్ నాయకులు పాల్గొన్నారు.