News

వేదిక్ వర్సిటీ ప్రొఫెసర్ కు విశిష్ట పురస్కారం

255views

తిరుపతిలో ఎస్వీ ప్రసాద్ భట్ ఘనాపాటికి అరుదైన పురస్కారం లభించింది. రుగ్వేదంలో విశేష కృషిచేసి అనేకమంది విద్యార్థులను పండితులుగా తీర్చిదిద్దినందుకుగాను ఆయనకు ‘విశిష్ట విద్వత్ సమ్మాన్’ పురస్కారాన్ని అందజేశారు. హరిద్వార్ వేదికగా మంగళవారం ఉజ్జయినిలోని మహర్షి సాందీపని రాష్ట్రీయ వేద విద్య ప్రతిష్ఠాన్, దేవస్థలి శోధ సంస్థ, శ్రీ మహేశ్వరానంద సాంగ వేద సంస్కృత విద్యాలయం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన అఖిల భారతీయ వైదిక సమ్మేళనంలో ఈ విశిష్ట పురస్కారాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ గణేష్ ప్రసాద్ భట్ ను వీసీ రాణి సదాశివమూర్తి, రిజిస్ట్రార్ రాధా గోవింద త్రిపాఠి, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది అభినందించారు.