News

ఇంకో లవ్ జిహాద్

261views

లవ్ జిహాద్ సంఘ పరివార్ అభూత కల్పన అంటూ ముస్లిం మత పెద్దలు ఎన్ని అబద్ధాలు చెప్పినా కొన్ని రుజువులు ఇప్పటికీ కనిపిస్తూనే ఉన్నాయి. తాజాగా ఉత్తరాఖండ్లో అలాంటి ఘటనే జరిగి, శాంతిభద్రతల సమస్య ఏర్పడింది. సల్మాన్ అనే వాడికి కేవలం 20 సంవత్సరాలు. ఇతడు తన పేరు మార్చుకుని 16 ఏళ్ల ఒక హిందూ బాలికకు వల వేశాడు. తరువాత మత మార్చాడు. దీనితో ఆగ్రహించిన స్థానికులు మైనారిటీ వర్గానికి చెందిన పలు దుకాణాలను ధ్వంసం చేశారు. అక్టోబర్ 29న ఆ బాలిక అదృశ్యం కావడంతో హిందూ సంఘాల వారు ఉద్యమానికి దిగారు. అయితే మరునాడే పోలీసులు ఆ బాలికను, సల్మాన్నీ, మరొక వ్యక్తిని కూడా ఉత్తరప్రదేశ్లోని సజీబాబాద్ లో అరెస్టు చేశారు. ఆ బాలికను వేధించినందుకు, మతం మార్చినందుకు కేసు నమోదు చేశారు. ఈ విషయం బయటపడిన సంగతి చూసినా ముక్కు మీద వేలేసుకోక తప్పదు. బాలిక పాఠశాలకు రాలేదని ఉపాధ్యాయులు ఆమె కుటుంబ సభ్యులకు తెలియచేయడంతో డొంకంతా కదిలింది. ఇంకా చిత్రం- సల్మాన్తో పారిపోవడానికి ముందు తన మిత్రులతో ఇస్లాంలోకి మారే విషయం ఆలోచించమని హితవు కూడా చెప్పింది. ఇప్పటికైనా ఉదారవాదులు, సెక్యులరిస్టులు కళ్లు తెరుస్తారా?