News

హిందువులే లక్ష్యం

187views

ప్రస్తుతం జస్టిన్ ట్రూడో, కెనడాలోని హిందువులను తన రాజకీయ లక్ష్యంగా చేసుకోవడం తాజా పరిణామం. ఖలిస్తానీ ఉగ్రవాదుల నేపథ్యంలో, సిక్కులను, మతఛాందసవాదం నేపథ్యంలో ముస్లింలను హిందువులు వ్యతిరేకించడమే ఇందుకు కారణం. కెనడాలో దీపావళి వేడుకలను రద్దుచేయడం ఇందులో భాగమే. దీనిపై భారత్ తీవ్ర ఆక్షేపణ తెలపడమే కాదు, ఇది బాధ్యతారహిత చర్యగా పేర్కొంది. కెనడా విపక్షనేత పియర్రీ పోయిలీవర్, ఒట్టావోలోని పార్లమెంట్ హిల్లో జరిగే దీపావళి వేడుకలను రద్దుచేయడం అక్కడి ఓటుబ్యాంకు పతన రాజకీయాలకు పరాకాష్ట

గతంలో కెనడాలోని వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు దీపావళి వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొనేవారు. భారత్ పై దౌత్యపరమైన దాడులకు మద్దతివ్వాలని జస్టిన్ ట్రూడో విపక్ష పార్టీలను కోరుతున్న నేపథ్యం లో ఈ పరిణామం జరగడం గమనార్హం. ఓవర్సీస్ ఫ్రండ్స్ ఆఫ్ ఇండియా- కెనడా (ఓఎఫ్ సీ) అధ్యక్షుడు శివభాస్కర్, దీపావళి వేడుకల రద్దు విషయంలో పియర్రీ పోయిలీవర్ నిర్ణయాన్ని తప్పుపట్టారు. తక్షణమే ఆయన క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఇదిలావుండగా భారత్ తాజాగా కెనడా సరిహద్దు పోలీసు అధికారి సందీప్ సింగ్ సిద్ధూ పేరును విచారణ జరపాల్సిన ఉగ్రవాదుల జాబితాలో చేర్చింది. పాకిస్తాన్లోని ఖలిస్తానీ ఉగ్రవాది లక్బీర్ సింగ్ రోడెతో సన్నిహిత సంబంధాలు నెరపుతూ, పంజాబ్లో ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నాడన్న ఆరోపణలు ఇతగాడి పై వున్నాయి. మొత్తంమీద పరిశీలిస్తే, వచ్చే ఏడాది ఎన్నికల వరకు కెనడా రాజకీయపార్టీలు, ఓట్లకోసం భారత వ్యతిరేక వ్యవహారశైలిని విడిచిపెట్టే పరిస్థితి కనిపించడంలేదు!