
244views
పల్నాడు జిల్లా కోటప్పకొండలోని మహారాణా ప్రతాప్ సింగ్ అన్నదాన సమాజ్ ప్రాగణంలో కార్తిక మాస నాలుగో వార్షికోత్సవ వన సమారాధన, మహారాణా ప్రతాప్‌సింగ్ విగ్రహా ఆవిష్కరణ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవిందబాబు, అఖిల భారత క్షత్రియ మహాసభ నేషనల్ ప్రెసిడెంట్ రాజా మహావీర్ సింగ్, మహారాణా ప్రతాప్‌సింగ్ స్మారక్ అభియాన్ నేషనల్ ప్రెసిడెంట్ చంద్రవీర్ సింగ్ నామానలు పాల్గొన్నారు. ప్రతాప్‌సింగ్ విగ్రహాన్ని అతిథులు ఆవిష్కరించి, నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ రాణా ప్రతాప్‌సింగ్ ఒక వ్యక్తి కాదని శక్తి అన్నారు. అఖిల భారత క్షత్రియ మహాసభ మహిళ ఉపాధ్యక్షురాలు పండరీబాయి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా రాణా ప్రతాప్‌సింగ్ విగ్రహాలు 500 వరకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. శ్రీశైలంలో మ్యూజియం నిర్మించనున్నట్లు వివరించారు.





