
360views
శ్రీశ్రీ జగద్గురు శంకరాచార్య మహాసంస్థానం, దక్షిణామ్నాయ శ్రీ శారదాపీఠం సన్నిధానమ్ శ్రీశ్రీ విధుశేఖర భారతీ స్వామి , 12 ఏళ్ళ తర్వాత తిరుమల, తిరుపతి పర్యటనకు వచ్చారు. జగద్గురువులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఈవో, అడిషనల్ ఈవో స్వాగతం పలికారు.
తిరుమల కొండకు శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి, శిష్య బృందం సమేతంగా చేరుకున్నారు. తిరుమలలోని శ్రీ శృంగేరి శంకర మఠంలో చంద్రమౌళీశ్వర పూజ చేసి అనంతరం అక్కడే బస చేశారు. గురువారం ఉదయం స్వామివారిని దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆలయం వద్దకు చేరుకున్న ఆయనకు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. కాగా.. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. సనాతన ధర్మవ్యాప్తికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించారు.అనంతరం శ్రీ వేంకటేశ్వర వేదపాఠశాలను సందర్శించారు.





