
218views
సరిహద్దుల్లో పాకిస్థాన్, చైనాతో ఇబ్బందులు ఎదురవుతున్న వేళ.. భారత్ తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకునే అద్భుత అవకాశం తలుపుతట్టింది. పొడవైన రెక్కలతో.. భారీ బాంబర్లతో శత్రువులపై విరుచుకుపడే బాంబర్ యుద్ధవిమానాలు టీయూ-160ఎం ‘వైట్ స్వాన్’లను భారత్‌కు ఇచ్చేందుకు రష్యా సంసిద్ధత వ్యక్తం చేసింది. దీన్ని తీసుకోవాలా వద్దా అనే అంశాన్ని భారత్ పరిశీలిస్తోంది. పొడవైన రెక్కలు కలిగిన ఈ భారీ యుద్ధవిమానాలను తీసుకుంటే రన్‌వేలను పునరుద్ధరించాల్సి ఉంటుంది. అలాగే పైలట్లు, సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇప్పించాల్సి ఉంటుంది. ఇవి గనుక అందుబాటులోకి వస్తే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో బలమైన రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకున్నట్టు అవుతుంది.





