
మధుర కృష్ణ జన్మభూమిపై తమకు అనుకూల నిర్ణయం వచ్చే వరకూ తాను ఏ కృష్ణ ఆలయాన్ని కూడా సందర్శించనని జగద్గురు శ్రీ రామభద్రాచార్యులు భీషణ ప్రతిజ్ఞ చేశారు. కృష్ణ జన్మభూమిపై నిర్ణయం అనుకూలంగా వచ్చే వరకు తాను ఏ కృష్ణుని ఆలయానికి వెళ్లనన్నారు. అయితే సాక్ష్యం చెప్పమని కోర్టుకు పిలిస్తే తప్పకుండా వెళ్తానని అన్నారు. అతి త్వరలోనే విజయం సాధిస్తామని జైపూర్ లో మీడియాతో మాట్లాడుతూ ప్రకటించారు.మరోవైపు పాక్ ఆక్రమిత కశ్మీర్ పై కూడా మాట్లాడారు. అతి త్వరలోనే మనం పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి పొందుతామని కచ్చితంగా అనుకుంటున్నాను’’ అని అన్నారు.
మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు హయాంలో భగవాన్ కృష్ణ జన్మస్థలంలో ఉన్న ఆలయాన్ని కూల్చివేసిన తర్వాత నిర్మించిన మథురలోని షాహీ ఈద్గా మసీదు స్థలం చుట్టూ వివాదం తిరుగుతుంది.
అంతకుముందు అక్టోబర్ 23న, మధురలోని శ్రీ కృష్ణ జన్మభూమి-షాహీ ఈద్గా వివాదానికి సంబంధించి హిందూ భక్తులు దాఖలు చేసిన అన్ని దావాలను ఏకీకృతం చేస్తూ జనవరి 11, 2024 నాటి ఉత్తర్వులను రీకాల్ చేయాలంటూ షాహి ఈద్గా మసీదు కమిటీ చేసిన విజ్ఞప్తిని అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. జస్టిస్ మయాంక్ కుమార్ జైన్ పిటిషన్‌ను తోసిపుచ్చారు. రీకాల్ పిటిషన్ 15 కేసులకు సంబంధించినది మరియు ఈ అంశంపై తన నిర్ణయాన్ని అక్టోబర్ 16కి కోర్టు రిజర్వ్ చేసింది.





