News

ఆంధ్రా నుంచి అయోధ్యకు బాలరాముడి ఉత్సవ విగ్రహం

249views

రాష్ట్రంలోని బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట పట్టణానికి చెందిన విగ్రహాలు తయారు చేసే కళాకారుడు వాసా శ్రీనివాస్ అయోధ్య బాలరాముని ఆలయంలో నిత్య పూజలు చేసేందుకు 25 కిలోల పంచలోహ విగ్రహాన్ని తయారు చేసి ఉచితంగా అందజేశారు. ఈ విగ్రహంతోపాటు సీతారామలక్ష్మణ హనుమం తుని విగ్రహాలను అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవ ఫౌండేషనకు ఉచితంగా అందజే శారు. నేలటూరు రోడ్డులో విగ్రహా లకు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. అనంతరం వాటిని ఫౌండేషన్ చైర్మన్ చల్లా శ్రీనివాసశాస్త్రికి అందజేశారు.

ఈ సందర్భంగా శ్రీనివాసశాస్త్రి మాట్లాడుతూ ఈ విగ్రహాలను తమిళనాడులో తయారు చేయిం చాలనుకుంటుండగా వాసా శ్రీనివాస్ ఉచితంగా అందజేస్తారన్నారని. ఈ మేరకు అందివ్వడం అభినందనీయమన్నారు. తెలుగు వాడినైన తాను అయోధ్యలో స్థిరపడినట్లు తెలిపారు. నిత్యం అయోధ్యకు వచ్చే వేలాది మంది యాత్రికులకు ఉచితంగా అన్నదానం చేస్తున్నట్లు తెలిపారు.

రూ.1.20 కోట్ల విలువైన ధనుర్బాణాలు
అయోధ్య బాలరాముడికి రూ.1.20 కోట్ల విలు వైన ధనస్సు, బాణాలు తయారు చేయించినట్లు అయోధ్య భాగ్యనగర్ సీతారామ సేవా ట్రస్టు నిర్వా హకుడు చల్లా శ్రీనివాసశాస్త్రి పేర్కొన్నారు. బాల రాముడి కోసం తాము తమిళనాడులో రూ.1.20 కోట్ల విలువైన బాణం, ధనస్సును వెండి, బంగా రంతో చేయించామన్నారు. ఇందుకు 14 కిలోల వెండి, కిలో బంగారం ఉపయోగించామన్నారు.