News

కేఏ పాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ

361views

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలంటూ సుప్రీంలో పాల్ పిటిషన్ వేశారు. శుక్రవారం ఆయన వేసిన పిటిషన్‌ సుప్రీంలో విచారణకు వచ్చింది. జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. తిరుమలను కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్న పాల్ పిటిషన్‌ను సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. దేశంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయని ఈ సందర్భంగా ఉన్నతన్యాయస్థానం వ్యాఖ్యానిస్తూ .. ఈ పిటిషన్‌ను కొట్టివేసింది.