News

శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులు

331views

కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం ఓంకారం, మహానంది, భోగేశ్వరం, యాగంటి, కాల్వబుగ్గ ఆలయాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్లు నంద్యాల జిల్లా ప్రజారవాణా అధికారి రజియాసుల్తానా తెలిపారు. ఆమె మాటాడుతూ జిల్లాలోని అన్ని డిపోల నుంచి శ్రీశైలానికి ప్రతి ఆది, సోమవారాల్లో బస్సులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా 15న అరుణాచలానికి(టికెట్‌ చార్జ్‌ రూ.1750) ప్రత్యేక బస్సును నడుపుతామన్నారు. భక్తులు బ్యాచ్‌లుగా ముందుకు వస్తే వారి కోసం సంబంధిత డిపోల నుంచి ప్రత్యేక బస్‌ సర్వీసును ఏర్పాటు చేస్తామన్నారు. ప్యాకేజీ టూర్‌ కింద ఒకే రోజులో పంచ శైవ క్షేత్రాలకు ఆది, సోమవారాల్లో బస్సు ఏర్పాటు చేస్తామన్నారు. నంద్యాల డిపో నుంచి ఉదయం 6 గంటలకు బయలుదేరి మహానంది, ఓంకారం, భోగేశ్వరం, యాగంటి, కాల్వబుగ్గకును చుట్టేసి రాత్రి 9 గంటలకు తిరిగి నంద్యాలకు చేరుకుంటుందన్నారు. కోవెలకుంట్ల నుంచి కన్నేతీర్థం, నయనాలప్ప, ఓంకారం, మహానంది, యాగంటిలకు కూడా బస్సు సర్వీస్‌ ఏర్పాటు చేశామన్నారు. నంద్యాల డిపో నుంచి ఉదయం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 8.30 గంటలకు కోవెలకుంట్ల డిపోకు చేరుతుందన్నారు. అలాగే శబరిమలకు వెళ్లేందుకు భక్తులు బ్యాచ్‌లుగా వస్తే అద్దెప్రాతిపదికన బస్సులను ఏర్పాటు చేస్తామన్నారు.