
266views
ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకు శబరిమల పుణ్యక్షేత్రం విశిష్టతను చాటిచెప్పడమే లక్ష్యంగా కేరళ రాష్ట్రానికి చెందిన ఇద్దరు అయ్యప్ప మాలధారులు బద్రీనాథ్ నుంచి శబరిమల వరకు 8 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. వారికి బుధవారం శ్రీకాకుళం జిల్లా కంచిలిలోని రాజు గురుస్వామి సన్నిధికి చెందిన గుడియా మిట్టు స్వామి తదితరులు స్వాగతం పలికారు. కేరళ రాష్ట్రం కేసరిగుడ్, రామ్‌దాస్ నాగర్ కూడ్లు ప్రాంతానికి చెందిన తాము జూన్ 2న పాదయాత్ర ప్రారంభించామని యాత్ర చేపట్టిన సనత్ కుమార్, సంపత్ కుమార్ తెలిపారు. ఉత్తరాది ప్రజలకు అయ్యప్ప దీక్షల విశిష్టత గురించి తెలియజేస్తూ వస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు 5,800 కిలో మీటర్ల యాత్ర పూర్తి చేశామన్నారు.





