News

నేడు గోదావరి మాతకు మహా నీరాజనం

253views

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు గోష్పాదక్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వ ర్యంలో అఖండ గోదావరి నదికి అందించే కార్తీక హారతికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు క్షేత్రంలోని ప్రధాన స్నానఘట్టంలో నదిలో పం టు ఏర్పాటు చేశారు. ఆ పంటుపై తిరుమల తిరుపతి నుంచి తీసుకువస్తున్న ఉత్సవమూర్తులను ఉంచుతారు. అనంత రం కార్తీకమాసం సోమవారం పురస్కరిం చుకుని అఖండ గోదావరి మాతకు (మహా నీరాజనం) హారతి అందజేస్తారు.సోమవారం సాయంత్రం 5-30 గంటల నుంచి 7-30 గంటల వరకు తితిదే నుంచి తీసుకువచ్చిన శ్రీ భూ సమేత వేంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు విశేష పూజలు, హరి నామ సంకీర్తనల అనంతరం గోదారమ్మకు వివిధ రకాల హార తులను అందించి మహా నీరాజనం సమర్పించడం జరుగుతుందని దాస సాహిత్య ప్రాజెక్టు కొవ్వూరు కోఆర్డినేటర్‌ రోహిణికుమార్‌ తెలిపారు.ఈ కార్యక్రమాన్ని సుమారు 10 వేల మంది భక్తులు వీక్షించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.