News

మిషనరీల కొత్త కుట్ర.. కాషాయ జెండాలతో ఏమార్చి… మత ప్రచారం

248views

దేశంలో అక్రమ మతమార్పిళ్లు చేయడానికి క్రిస్టియన్ మిషనరీలు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటాయి. డబ్బులు ఇవ్వడం, ఆరోగ్యం బాగుపడడానికి రకరకాల ప్రయత్నాలు… ఇలా చాలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. కానీ.. ఛత్తీస్ గఢ్ లోని రాయ్ పూర్ లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. అక్రమ మత మార్పిళ్లు చేయడానికి మిషనరీలు గ్రామాల్లోకి తమ వాహనాలకు కాషాయ జెండాలను అలంకరించుకొని వచ్చారు. కాషాయ జెండాలతో అలంకరించిన వాహనాల్లో వచ్చి, క్రైస్తవ ప్రచారం, క్రైస్తవ మత ప్రచారాలు, వారి కరపత్రాలను పంచారు. కాసేపటికి గిరిజనులకు అర్థమై, మిషనరీలను వ్యతిరేకంగా తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.ప్రచారాన్ని అడ్డుకున్నారు. అలాగే మిషనరీలు కాషాయ జెండాలు పెట్టుకొని గ్రామంలోకి వచ్చినట్లు బజరంగ్ దళ్ కార్యకర్తలు తెలుసుకున్నారు. వీరు అక్కడికి చేరుకోగానే మిషనరీలు అక్కడి నుంచి పారిపోయాయి.
ప్రత్యక్ష సాక్షుల కథన ప్రకారం క్రైస్తవ మిషనరీలు కాషాయ జెండాలను తమ వాహనాలకు తగిలించుకొని వచ్చారని, దీంతో తాము వారిని గుర్తించలేకపోయామన్నారు. కాషాయ జెండాలు వుండటంతో తాము కూడా అడ్డుకోలేకపోయామన్నారు. దీంతో వారు తమ గ్రామంలోకి ప్రవేశించి మిషనరీల ప్రచారం, క్రైస్తవ ప్రచారం చేయడంతో తమకు అర్థమైందని, వెంటనే నిరసన వ్యక్తం చేశామన్నారు.

ఈ ఘటనపై బజరంగ్ దళ్ నేతలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇలాగే అక్రమ మత మార్పిళ్లు జరుగుతున్నాయని మండిపడ్డారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ కి ఓ మెమోరండం సమర్పించారు. మరోవైపు క్రైస్తవుల ఆగడాలపై పోలీసులకు ఫిర్యాదు చేసినా, ఎలాంటి కేసులు నమోదు కాలేదని గ్రామస్థులు అన్నారు.