News

శబరిమల యాత్రికులకు రూ.5 లక్షల ఉచిత బీమా

235views

ఈ ఏడాది మండలం-మకరవిలక్కు యాత్రా సీజన్‌లో శబరిమలలో అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు ఒక్కొక్కరికి రూ.5లక్షల ఉచిత బీమా కల్పించనున్నారు. ఆలయ నిర్వహణను పర్యవేక్షించే ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు(టీడీబీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుందని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వి.ఎన్‌.వాసవన్‌ వెల్లడించారు. ఈ నెల చివరిలో ప్రారంభమయ్యే యాత్రా సీజన్‌లో స్వామి వారి దర్శనం సాఫీగా జరిగేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించే భక్తులను వారి స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లను టీడీబీ చేస్తుందన్నారు. గత ఏడాది యాత్రా సీజన్‌లో 15 లక్షల మంది భక్తులకు అన్నదానం చేసినట్లు తెలిపారు. ఈసారి 20 లక్షల మంది భక్తులకు సన్నిధానం వద్ద అన్నదానానికి సన్నాహాలు చేస్తున్నట్లు వెల్లడించారు.