
కేదార్‌నాథ్ ధామ్ ఆలయ తలుపులు ఆదివారం నుంచి మూసివేయనున్నారు. అయితే శీతాకాలం వస్తున్న నేపథ్యంలో తగిన ఆచారాలతో బంద్ చేస్తారు. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు భూకుంత్ భైరవనాథుని ఆశీస్సులు అందుకుంటారు. శతాబ్దాలుగా అనుసరిస్తున్న కేదార్‌నాథ్ ధామ్ తలుపులు మూసే ముందు ప్రత్యేక పూజలు చేస్తారు. భాయ్ దూజ్ పండుగ సోదర సోదరీమణుల మధ్య పవిత్ర సంబంధాన్ని సూచిస్తుంది. ఈ రోజున సోదరీమణులు తమ సోదరుల నుదుటిపై తిలకం దీద్ది వారి దీర్ఘాయువు, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు.
కారణమిదే..
శీతాకాలం కారణంగా నిబంధనల ప్రకారం లార్డ్ కేదార్‌నాథ్ ద్వారపాలకుడైన భుకుంత్ భైరవనాథ్ ఆలయ తలుపులు ఆరు నెలల పాటు మూసివేస్తారు. ప్రత్యేక పూజల అనంతరం ఆలయంలో కేదార్‌బాబా పంచముఖి డోలీని ప్రతిష్టించనున్నారు. తదుపరి ఆరు నెలల పాటు, ఉఖిమఠ్‌లోని ఓంకారేశ్వర్ ఆలయంలో భోలే బాబా ఆరాధన, దర్శనం జరుగుతాయి. అదే సమయంలో బద్రీ-కేదార్ ఆలయ కమిటీ ఆలయ తలుపులు మూసివేయడానికి సన్నాహాలు ప్రారంభించింది.
ప్రత్యేక పూజలు
కేదార్‌నాథ్ ఆలయ పూజారి శివశంకర్ లింగ్‌తో పాటు బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ, తీర్థ పురోహిత్ సమాజ్, పంచపాండ కమిటీ అధికారులు ఇప్పటికే భైరవనాథ్ ఆలయానికి చేరుకున్నారు. ఆ తరువాత భుకుంత్ భైరవనాథ్ జలాభిషేకం తరువాత, అన్నదానం, ప్రార్థనలు సమర్పించి హవన యాగం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. నవంబరు 1న బాబా కేదార్‌నాథ్ ధామ్‌లో లక్ష్మీ పూజలతో పాటు దీపావళి పండుగను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈసారి కేదార్‌నాథ్ ధామ్‌కు చేరుకున్న యాత్రికుల సంఖ్య 15.5 లక్షలు దాటింది. ఈ రోజుల్లో దర్శనం కోసం ప్రతిరోజూ సుమారు 19 నుండి 20 వేల మంది భక్తులు కేదార్‌నాథ్ ధామ్ చేరుకున్నారు.




