News

టీటీడీ ఉద్యోగులు హిందువులే వుండాలి : టీటీడీ నూతన చైర్మన్

171views

టీటీడీలో పనిచేసే వారు హిందువులే అయి వుండాలని టీటీడీ నూతన చైర్మన్ బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. ఏపీ ప్రభుత్వంతోనూ దీనిపై స్పష్టంగా చర్చిస్తామని, పనిచేసే ఉద్యోగులు కచ్చితంగా హిందువులై అయి వుండాలని తేల్చి చెప్పారు. ఇదే విధానమని అన్నారు. ఈ విషయాన్ని తాము సీరియస్ గా తీసుకుంటున్నామని, తిరుమల వేంకటేశ్వర స్వామి విషయంలో అందరికీ శ్రద్ధ, భక్తి వుండాల్సిందేనని స్పష్టం చేశారు. తాను మాత్రం టీటీడీ బోర్డు చైర్మన్ గా టీటీడీ విషయంలో భక్తి శ్రద్ధలతో వుంటానని, పని విధానంలోనూ అంతే శ్రద్ధ తీసుకుంటానని అన్నారు. ఎవరున్నా టీటీడీ పవిత్రతను కాపాడాల్సిన అవసరం మాత్రం వుందని తేల్చి చెప్పారు.

టికెట్ల విషయంలో ఆలోచన చేస్తామని, గతంలో ఉన్న పద్ధతిని మళ్లీ తీసుకొస్తామని తెలిపారు. మెటీరియల్ సప్లయ్‌, ఆలయ భూములపై ప్రత్యేక కమిటీలు వేస్తామని, తిరుమలలోని యూనివర్సిటీ, ఆస్పత్రులపై దృష్టిసారిస్తామని బీఆర్ నాయుడు స్పష్టం చేశారు. కొండపై గాజు సీసాల్లో నీళ్లు భక్తులకు భారంగా మారాయన్న ఆయన, వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి పేపర్ గ్లాసులు ఉచితంగా ఇవ్వాలనే ఆలోచన చేస్తున్నామని తెలిపారు.