
280views
తిరుమలలో నవంబర్ నెలలో జరగనున్న విశేష పర్వదినాల వివరాలను టీటీడీ ఒక ప్రకటనలో వెల్లడించింది. నవంబర్ 1న కేదారగౌరీ వ్రతం, 3న భగినీహస్త భోజనం, శ్రీ తిరుమలనంబి శాత్తుమొర, 5న నాగుల చవితి, పెద్ద శేషవాహనం, 6న శ్రీ మనవాళ మహామునుల శాత్తుమొర, 8న వార్షిక పుష్పయాగా నికి అంకురార్పణ, 9న శ్రీవారి పుష్పయాగం, అత్రి మహర్షి వర్ష తిరునక్షత్రం, పిళ్లైలో కాచార్య వర్ష తిరునక్షత్రం, పోయిగైయాక్వార్ వర్ష తిరునక్షత్రం, పూదత్తాళ్వార్ వర్ష తిరునక్షత్రం, వేదాంత దేశికుల శాత్తుమొర, 10న పేయాళ్వార్ వర్ష తిరు నక్షత్రం, 11న శ్రీ యాజ్ఞవల్క్య జయంతి, 12న ప్రబోధన ఏకాదశి, 13న కై శిక ద్వాదశి ఆస్థానం, చాతుర్మాస్య వ్రత సమాప్తి, 15న కార్తీక పౌర్ణమి, 28న ధన్వంతరి జయంతి, 29న మాస శివరాత్రి నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు.





