News

ప్రొద్దుటూరులో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో పథ సంచలన్

262views

రాష్ట్రీయస్వయంసేవక్ సంఘ్ 99 సంవత్సరాలు పూర్తి చేసుకుని శత వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అనంతపురం విభాగంలోని అన్ని ఖండ , నగర కేంద్రాలలో పథ సంచలన్ నిర్వహించడంలో భాగంగా వైయస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో శ్రీ నామ ఎరుకులయ్య ఆశ్రమం నుంచి పురవీధుల గుండా పథ సంచలన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కడప జిల్లా కార్యవాహహ్ సి.ప్రసాద్ మాట్లాడుతూ, 35 కేంద్రాలలో ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా అనంతపురం జిల్లా కడప జిల్లాలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరులో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీ రోడ్డు , టీవీ రోడ్డు , రాజీవ్ సర్కిల్ , శివాలయం సర్కిల్ మీదుగా తిరిగి పథ సంచలన్ శ్రీ నామ ఎరుకులయ్య ఆశ్రమానికి చేరుకుంది అనంతరం అక్కడ జరిగిన కార్యక్రమంలో సంఘ సేవకులు మాట్లాడారు.