News

టీటీడీ ఈఓ విస్తృత తనిఖీలు

266views

తిరుమలలో టీటీడీ ఈఓ జె.శ్యామలరావు, అడిషనల్‌ ఈఓ సీహెచ్‌.వెంకయ్య చౌదరితో కలిసి విస్తృత తనిఖీలు నిర్వహించారు. ముందుగా వకుళామాత కేంద్రీయ వంటశాలను పరిశీలించారు. అక్కడ నూతనంగా నిర్మిస్తున్న పీఏసీ–5ని తనిఖీ చేశారు. అనంతరం కౌస్తుభం, సప్తగిరి, ఎస్‌ఎంసీ, షాపింగ్‌ కాంప్లెక్స్‌ వద్ద హోటళ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. అక్కడి నుంచి శిలాతోరణం వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టారు. ఔటర్‌ రింగ్‌ రోడ్డులో భక్తుల సౌకర్యార్థం టీటీడీ నిర్మిస్తున్న నూతన క్యూలైన్లు, మరుగుదొడ్లు, ఫుడ్‌ కోర్టులను పరిశీలించారు. టీటీడీ సీఈ సత్యనారాయణ, ఈఈలు వేణు గోపాల్‌, సుబ్రహ్మణ్యం, డీఈ చంద్రశేఖర్‌, ఎస్టేట్స్‌ అధికారి వెంకటేశ్వరులు, డెప్యూటీ ఈఓ (హెల్త్‌) ఆశాజ్యోతి, హెల్త్‌ అధికారి డాక్టర్‌ మధుసూదనప్రసాద్‌, వీజీఓ సురేంద్ర పాల్గొన్నారు.