News

తిరుపతి TO అయోధ్య.. రథయాత్ర ప్రారంభించిన విజయేంద్ర సరస్వతి

373views

తిరుపతి శ్రీవారి పాదాల చెంత నుంచి అయోధ్యకు శ్రీరామ యంత్ర రథయాత్ర చేపట్టినట్టు కంచి మఠం పీఠాధిపతి అనంత శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములవారు తెలిపారు. తిరుపతి ఇస్కాన్‌రోడ్డులోని కంచి మఠంలో శ్రీరామ యంత్రానికి (శ్రీచక్రం)కి స్వామిజీ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తిరుపతి నుంచి అయోధ్యకు తీసుకు వెళుతున్న శ్రీరామ యంత్ర రథాన్ని టిటిడి జేఈవో వీరబ్రహ్మంతో కలిసి స్వామిజీ జెండా ఊపి ప్రారంభించారు.

పురాతనమైన కంచిమఠంలో శ్రీరాముడి మూల యంత్రం ఉందని అనంత శ్రీ విజయేంద్ర సరస్వతి స్వాములవారు తెలిపారు తెలిపారు. పురాతన మహా యంత్రం లాగానే నూతనంగా యంత్రాన్ని తయారు చేయించామన్నారు. అయోధ్యలోని రామాలయ సన్నిధిలో శ్రీరామ యంత్రాన్ని ప్రతిష్ఠించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే బాల రాముడి మూల విరాట్ కింద విగ్రహ ప్రతిష్ఠ సమయంలో బంగారు రామ యంత్రాన్ని ఉంచారన్నారు. ఈ నెల 27 నుంచి నవంబర్ 17 వరకు శ్రీవారి క్షేత్రం తిరుపతి నుంచి అయోధ్య వరకు 1800 కిలోమీటర్లు మేర రథయాత్ర సాగుతుందన్నారు. 45 రోజులు మండల దీక్ష అనంతరం అయోధ్యలో జనవరి 1న లక్ష చండీ యాగం జరుగుతుందన్నారు.