News

గ్వాలియర్ లో నాలుగు రోజుల పాటు సంఘ వివిధ క్షేత్ర ప్రచారకుల సమావేశాలు

388views

మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కేంద్రంగా వివిధ క్షేత్రాల సంఘ ప్రచారకులకు ఈ నెల 31 నుంచి నవంబర్ 4 వ తేదీ వరకు వర్గ నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఈ సమావేశాలకు వివిధ క్షేత్రాల్లో పనిచేస్తున్న సంఘ ప్రచారకులు 554 మంది హాజరవుతున్నారని పేర్కొన్నారు. ప్రతి నాలుగైదు సంవత్సరాలకోసారి ఇలాంటి వర్గ జరుగుతుంది. ఈ వర్గలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సరసంఘచాలక్ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో పాటు ఆరెస్సెస్ సహ సర్ కార్యవాహలు, ఇతర ప్రముఖ అధికారులు కూడా పాల్గొంటారు.

ఈ వర్గలో దేశంలోని సమస్యలు, కార్మికుల ఇబ్బందులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, సాంఘిక, సామాజిక, ఆర్థిక, గ్రామీణ, వనవాసీ, మత పరమైన సమస్యలపై చర్చిస్తారు. అలాగే వ్యక్తిగత అభివృద్ధి, శ్రేయస్సుతో పాటు సామాజిక జీవనానికి అవసరమయ్యే వాటిని కూడా చర్చిస్తుంది. అలాగే దేశ సమస్యలు , మహిళా సాధికారత, సామాజిక అంశాలు, దివ్యాంగుల సమస్యలపై కూడా దృష్టి సారిస్తుంది. వీటన్నింటితో పాటు స్వావలంబన, భద్రత, సేంద్రీయ వ్యవసాయం, నీటి సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ లాంటి అంశాలపై కూడా చర్చిస్తారు.