తిరుమల–తిరుపతి దేవస్థానాల అనుబంధ సంస్థ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 8న వైయస్సార్ జిల్లా విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ గోపిబాబు తెలిపారు.ఆ సంస్థ కార్యాలయంలో ఆయన వైయస్సార్ జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు కె.విజయభట్టర్, ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి రామ మహేష్, సభ్యులు దామోదరమ్మ, డి.వెంకటరెడ్డి, చింతకుంట శివారెడ్డి, మునికుమార్‌లతో కలిసి ఈ వివరాలను తెలిపారు. పోటీల్లో భాగంగా సంపూర్ణ భగవద్గీత శ్లోకాలను విద్యార్థులు చెప్పాల్సి ఉంటుందన్నారు. 6, 7 తరగతుల విద్యార్థులను మొదటి విభాగంగా, 8, 9 తరగతుల విద్యార్థులను రె ండవ విభాగంగా, ధ్యాన యోగంపై శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్లలోపు వయసు గల విద్యార్థులను సీనియర్స్ విభాగంగా గుర్తించి.. సంపూర్ణ భగవద్గీతపై పోటీ నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఈ పోటీలను హౌసింగ్‌బోర్డు కాలనీ శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఉదయం 9 గంటల నుంచి నిర్వహిస్తామని ఆయన వివరించారు.
288views
You Might Also Like
నేతాజీ అస్థికలు భారత్‌కు వస్తాయా? సుప్రీంకోర్టులో కీలక పరిణామం
39
న్యూఢిల్లీ: స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అస్థికలను జపాన్ నుంచి భారత్‌కు తీసుకురావాలన్న అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. టోక్యోలోని రెంకోజీ ఆలయంలో భద్రపరిచినట్లు చెబుతున్న...
బ్రిటన్ను ఇస్లామిక్ రిపబ్లిక్‌గా అభివర్ణించిన నెతన్యాహు
31
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరోసారి తన వ్యాఖ్యలతో అంతర్జాతీయంగా వివాదాన్ని రాజేశారు. బ్రిటన్ను "ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ బ్రిటన్" అని అభివర్ణించిన ఆయన, అణ్వాయుధాలు కలిగిన...
షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌పై భారీ ఆపరేషన్.. 14 రాష్ట్రాల్లో 200 మందికిపైగా అరెస్టు
34
న్యూఢిల్లీ: ఐఎస్ఐ మద్దతు ఉన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న షహజాద్ భట్టీ నెట్‌వర్క్‌పై దేశవ్యాప్తంగా భారీ ఆపరేషన్ నిర్వహించినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. స్వాతంత్ర్య దినోత్సవానికి...
మెరిట్ ఆధారంగానే అర్చకులు, వేద పండితుల నియామకాలు
59
రాష్ట్రంలోని దేవాలయాల్లో అర్చకులు, వేద పండితులు, పరిచారకులు, ఇతర ధార్మిక సిబ్బంది నియామకాల్లో ప్రస్తుతం జోనల్ విధానం అమల్లో లేదని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ...
Key Focus on Demographic Imbalance and Youth De-addiction Major Topics on the Agenda for RSS Meetings : RSS Akhil Bharatiya Prachar Pramukh Sunil Ambekar
51
Visakhapatnam, August 18: Sunil Ambekar, Akhil Bharatiya Prachar Pramukh of the Rashtriya Swayamsevak Sangh (RSS), stated that the upcoming meetings...
‘హిందువులను సహిస్తున్నాం’.. జర్దారీ వ్యాఖ్యలపై జావేద్ అక్తర్ ఘాటు స్పందన
55
ముంబై: పాకిస్థాన్‌లోని హిందూ జనాభాను తాము ‘సహిస్తున్నామని’ ఆ దేశ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ చేసిన వ్యాఖ్యలపై ప్రముఖ గీత రచయిత, స్క్రీన్‌రైటర్ జావేద్ అక్తర్...





