
శ్రీశైలం దేవస్థానంలో స్వర్ణరథం కోసం గంగాధర మండపం సమీపంలో ప్రత్యేక రథశాలను నిర్మించనున్నామని శ్రీశైల దేవస్థాన ఇన్‌చార్జ్ ఈఓ ఇ.చంద్రశేఖరరెడ్డి తెలిపారు. ఏనుగుల చెరువు, పంచ మఠాలు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రదేశాలను పరిశీలించారు. ఏనుగుల చెరువులో బోటింగ్ నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆయన ఆదేశించారు. పంచమఠాల ప్రాంగణాల చుట్టూ పచ్చదనాన్ని అభివృద్ధి చేయాలన్నారు. ఏక రహదారిని నిర్మించే పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలన్నారు. భక్తుల సౌకర్యార్థం మరిన్ని ఏటీఎంలు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. గంగాసదన్ సమీపంలో ఉన్న స్థలంలో ఏటీఎం నిర్వహణ పనులు ప్రారంభించారు. మహాశివరాత్రిని దృష్టిలో ఉంచుకుని సిద్దిరామప్ప కాంప్లెక్స్, ఆర్టీసీ బస్టాండ్ మధ్యలో ఉన్న ఖాళీ స్థలంలో శౌచాలయాలను వీలైనంత త్వరగా నిర్మించాలన్నాన్నారు. ఇన్‌చార్జ్ ఈఓ వెంట ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎం.నరశింహారెడ్డి, డీఈఈ సుబ్బారెడ్డి, ఉన్నారు.





