
భోజశాల కేసులో మధ్యప్రదేశ్ హైకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పును ఇచ్చింది. ఆ ప్రదేశం వాగ్దేవికి అంకితమైన హిందూ ఆలయమని ప్రకటించింది. అక్కడ పూజలు చేసే ప్రత్యేక హక్కును హిందువులకు కల్పించింది. ఈ తీర్పును ఇవ్వడంలో రామ జన్మభూమి కేసు (అయోధ్య తీర్పు)లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ప్రధానంగా చేసుకుంది. రామ జన్మభూమి కేసులో (న్యాయస్థాన రికార్డులలో చట్టపరమైన ప్రతినిధుల ద్వారా ఎం. సిద్ధిఖ్ వర్సెస్ మహంత్ సురేష్ దాస్; ఇతరులుగా నమోదైనది) సుప్రీంకోర్టు తీర్పు నుండి వెలువడిన 10 సూత్రాలను హైకోర్టు న్యాయ మూర్తులు గుర్తించారు. వాటిని వివరించారు. ఎందుకంటే, సంబంధిత పక్షాలన్నీ ఏదో ఒక సందర్భంలో ఈ తీర్పునే ప్రాతిపదికగా తీసుకు న్నాయి. ఆ సూత్రాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి:
భోజశాల విషయాన్ని హిందువులకు అనుకూలంగా నిర్ణయించడంలో అయోధ్య కేసులో సుప్రీంకోర్టు తీర్పు చూపిన అసాధారణ ప్రభావాన్ని మధ్యప్రదేశ్ హైకోర్టు ముగింపు వ్యాఖ్యలు చక్కగా వివరిస్తాయి. అది ఇలా పేర్కొంది: వివాదాస్పద ప్రాంతం స్వభావాన్ని నిర్ధారించడానికి, అయోధ్య కేసులో సుప్రీంకోర్టు నిర్దేశించిన పైన పేర్కొన్న 10 సూత్రాలను మనం దృష్టిలో ఉంచుకోవాలి’’ అని హైకోర్టు పేర్కొంది.

ఎ. సూర్యప్రకాశ్
మాజీ చైర్మన్, ప్రసారభారతి





