News

కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎనిమిది గుణాలు అవసరం : రవీంద్ర జోషి

27views

కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువల కారణంగానే భారతీయ సంస్కృతి ఇప్పటికీ సురక్షితంగానే వుందని అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన్ సంయోజక్ రవీంద్ర జోషి అన్నారు. భారత్ లో ఎన్నో పోరాటాలు, సవాళ్లు వచ్చాయని, అయినా కుటుంబ వ్యవస్థ చెక్కు చెదరలేదన్నారు. దేశం పట్ల అంకిత భావం, బాధ్యత అనే భావనలు కుటుంబం అనే పాఠశాలలోనే అలవడుతాయన్నారు.

వారణాసిలోని ముముక్షు భవన్ లో ‘‘పూర్వ ఉత్తర ప్రదేశ్ క్షేత్ర కుటుంబ ప్రబోధన్’’ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆరెస్సెస్ అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన్ సంయోజక్ రవీంద్ర జోషి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మానవ జన్మ అత్యంత అరుదైనదని, వివిధ సాహిత్యాలలో మానవ జన్మ ప్రాముఖ్యతను వివరించారన్నారు. ప్రతి వ్యక్తి మానవ జన్మ గొప్పతనాన్ని అర్థం చేసుకోవాలి మరియు ఒక్క క్షణం కూడా వృథా కానివ్వకూడదన్నారు.

ఈ సందర్భంగా ప్రస్తుత కుటుంబ వ్యవస్థ గురించి కూలంకషంగా వివరించారు. ఇళ్ల్లో శారీరక శ్రమను తగ్గించే అనేక పరికరాలు అందుబాటులోకి వచ్చాయన్నారు. అయితే.. కుటుంబంలో భక్తి భావంతో కూడినా సానుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేసే బాధ్యత అందరిపై వుందన్నారు.గత కొన్నేళ్లుగా భారతీయ కుటుంబ వ్యవస్థను నాశనం చేయడానికి అనేక కుట్రలు జరుగుతున్నాయని, వివాహం లేకుండా పరస్పర అంగీకారంతో కలిసి జీవించాలన్న యువతీయువకుల నిర్ణయం కుటుంబ వ్యవస్థను బలహీనపరుస్తూ, విచ్ఛిన్నం చేస్తోందని పేర్కొన్నారు.

కుటుంబ వ్యవస్థను మరింత బలోపేతం చేయడానికి ఎనిమిది గుణాలు అవసరమని ఆయన పేర్కొన్నారు. బలం, శీలసంపద, ఉత్సాహం, సహనం, వ్యూహరచన, వివేకం, దూరదృష్టి మరియు సమర్థత అనే గుణాలు కావాలని వివరించారు. అలాగే, భయం, స్వార్థం, అహంకారం, బద్ధకం, తప్పుడు సామాజిక నమ్మకాలు మరియు ఆలోచనా విధానంలో మొండితనం వంటి ఆరు దుర్గుణాలను కుటుంబానికి దూరంగా ఉంచాలని ఆయన చెప్పారు.

ఈ భూమిపై 99 శాతం మంది వివాహం ద్వారానే ఆనందాన్ని పొందుతారని ఆయన అన్నారు. అయితే, దీనికి సహనం, అవగాహన మరియు సమన్వయం వంటి గుణాలు అవసరమని అన్నారు. సంఘ్ కార్య శతాబ్ది సందర్భంగా తెచ్చిన పంచపరివర్తన్ లో కుటుంబ ప్రబోధన్ అని వుందని, ఈ కుటుంబ ప్రబోధన్ కాదని, మిగిలన నాలుగూ అసాధ్యమని, సమాజంలో మార్పు సాధ్యం కాదని తేల్చి చెప్పారు.

ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తూ, కైలాష్ మఠం మహా మండలేశ్వర్ పూజ్య స్వామి అశుతోషానంద్ గిరి జీ మహారాజ్ మాట్లాడుతూ, 1200 ఏళ్ల క్రితం కేరళలోని కలాడి గ్రామంలో జన్మించిన ఒక బాలుడు తన గురువు వద్ద విద్యను అభ్యసించేందుకు ఓంకారేశ్వర్‌కు వెళ్లారని, ఆ తర్వాత కాశీలో మాతా అన్నపూర్ణకు నమస్కరించారని పేర్కొన్నారు. ఈ సంఘటన భారతదేశం మొత్తాన్ని ఒకే కుటుంబంగా ప్రతిబింబిస్తుంది. భారతదేశంలోని వర్ణ వ్యవస్థ అనేది వాస్తవానికి సామాజిక బాధ్యతల వర్గీకరణ అని స్వామీజీ అన్నారు.

source : organiser