News

ఈ ఐఏఎస్ కి అన్య మతాల లౌడ్ స్పీకర్లు వినిపించవు.. కనిపించవు

226views

ఆవిడ ఓ ఐఏఎస్ అధికారిణి. ప్రజలను, మతాలను సమానంగా చూడాల్సిన ఓ అధికారిణి హిందూమతంపై నిత్యం విషం చిమ్ముతూ వార్తాల్లోకి ఎక్కారు. మధ్యప్రదేశ్ లో దేవాలయ లౌడ్ స్పీకర్ల వినియోగంపై ఐఏఎస్ అధికారి శైలబాలా మార్టిన్ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తూ విమర్శలకు దిగుతున్నారు. దీంతో ఈ వార్త ప్రముఖంగా వార్తల్లోకి ఎక్కింది. శైలబాల మార్టిన్ 2009 బ్యాచ్ కి చెందిన ఏఏఎస్. ప్రస్తుతం జనరల్ అడ్మినిస్ట్రేషన్ లో అడిషనల్ సెక్రెటరీగా వున్నారు. అయితే కేవలం హిందూ దేవాలయాల లౌడ్ స్పీకర్ల విషయంలోనే పోస్టులు పెడుతున్నారు. ఈ ఐఏఎస్ కి ఇతర మతాల లౌడ్ స్పీకర్లు కనిపించవా? వినిపించవా? అంటూ హిందువులు మండిపడుతున్నారు. 2014 లో ఆమె ఆరోగ్యశాఖలో, 2019 లో బుర్హాన్ పూర్ మున్సిపల్ కమిషనర్ గా, అదే సంవత్సరం నివారి జిల్లా కలెక్టర్ గా కూడా పనిచేశారు. 2022 నుంచి మాత్రం సాధారణ పరిపాలనలో అదనపు కార్యదర్శిగా పనిచేస్తున్నారు.

శబ్ద కాలుష్యాన్ని తగ్గించడానికి గత సంవత్సరం మధ్యప్రదేశ్ సర్కార్ కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది. ఇది ప్రత్యేకంగా మతపరమైన వేదికలలో లౌడ్ స్పీకర్లను నియంత్రించడానికే ఉద్దేశించబడింది. దీంతో ఓ పాత్రికేయుడు మసీదులలో లౌడ్ స్పీకర్ల వాడకం మరియు డీజేల వాడకంపై దృష్టి సారించి, ఈ అసమానతలు ఎందుకు ? అంటూ సూటిగా ప్రశ్నించారు. దీనికి కౌంటర్ గా ఐఏఎస్ అధికారిణి శైలబాల మార్టిన్ హిందూ దేవాలయాల లౌడ్ స్పీకర్లను టార్గెట్ చేసి, ఎత్తిచూపారు. హిందూ దేవాలయాల గురించి ఎందుకు మాట్లాడరని, ఎందుకు పట్టించుకోరని ఆమె నిలదీశారు. ఈ మేరకు ట్వీట్లు కూడా చేయడంతో వివాదం ముదిరింది. కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తుండగా… హిందువులు మాత్రం ఆమె ద్వంద్వ వైఖరిపై మండిపడుతున్నారు.