
శ్రీకాకుళం జిల్లాలోని శ్రీముఖలింగం దక్షిణ కాశీ అని, ఇక్క డ శివలింగం ముఖం రూపం దాల్చి ఉంటుందని, శ్రీముఖలింగంలో ముఖ దర్శనం చేసుకుంటే మో క్షం సిద్ధిస్తుందని అందరికీ తెలుసు. కానీ ఇదే క్షేత్రంలో మరో కథ కూడా ఉంది. ఇక్కడి శివలింగం ఎంత ప్రత్యేకమో ఆ రూపం వెనక ఉండే గోలెం కూడా అంతే ప్రత్యేకం. ఈ గోలేనికి కూడా ఓ కథ ఉంది.
గోలేం కథ ఇది..
శ్రీముఖలింగం గ్రామానికి చెందిన కుమ్మరి నాగన్న ఎన్నో ఏళ్లుగా సంతానం లేకుండా బాధ పడుతుంటాడు. సంతానం కోసం స్వామిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తుంటాడు. తనకు కుమారుడు పుడితే ఓ పెద్ద మట్టి గోలేం చేసి దాని నిండా ఆవుపాలు పోసి అభిషేకం చేస్తానని మొక్కుకుంటాడు. కొన్నా ళ్లకు నాగన్నకు ఓ కుమారుడు పుడతాడు. మొక్కు చెల్లించుకోవడానికి ఓ పెద్ద మట్టి గోలేం చేసి దాని నిండా పాలుపోసి దాన్ని గర్భాలయంలోనికి తీసుకుపోవడానికి ప్రయత్నిస్తాడు. అది గర్భ గుడి ద్వారం పట్టనంత పెద్ద గోలేం అవ్వడంతో తీసుకెళ్లలేకపోతాడు. దీంతో ఆలయం ముఖమంటపంలోనే గోలేంతోపాటు తన ఆ పరమ శివుడు ప్రసాదించిన బిడ్డను కూడా వదిలి ఇంటికి వెళ్లిపోతాడు. మర్నాడు స్వామి వారి నిత్యపూజలకై అర్చకులు గర్భగుడి తలుపులు తీసి చూడగా ఆ గోలేం మూలవిరాట్టు వెనకాల ఉంటుంది. అలాగే నాగన్నకు పుట్టిన బిడ్డకు కూడా గోలేం పక్కనే బోసినవ్వులతో ఆడుకుంటూ కనిపిస్తాడు. అప్పటి నుంచి భక్తులు తమ కోరికలు నెరవేరిన తర్వాత ఈ గోలెంలో మొక్కులు వేయడం ఆనవాయితీగా మారింది.





