
383views
పార్వతిపురం మన్యం జిల్లా నుంచి నవంబర్ 4 నుంచి పంచ శైవక్షేత్ర దర్శిని బస్సులను అందుబాటులో తీసుకురానున్నట్టు పార్వతీపురం డిపో మేనేజర్ కనకదుర్గ తెలిపారు. ఈ మేరకు బస్సులకు సంబంధించి పోస్టర్లను స్థానిక ఆర్టీసీ డిపోలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంఘం సోమేశ్వర స్వామి, నారాయణపురం నీలకంఠేశ్వర స్వామి, అడ్డాపుశీల కాశీ విశ్వేశ్వరస్వామి, గుంప సోమేశ్వరస్వామి, తోటపల్లి కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయాల సందర్శనకు నవంబర్ 4, 11, 18, 25 తేదీల్లో ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆమె తెలిపారు. పంచారామ పుణ్యక్షేత్రాలకు ఒకరోజు దర్శనం నిమిత్తం ప్రతి కార్తీక సోమవారం నవంబర్ 3, 10, 17, 24 తేదీల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు.





