
355views
దేవాలయాల పరిరక్షణ ప్రతి ఒక్క హిందువు బాధ్యతగా తీసుకోవాలని వీహెచ్‌పీ న్యూఢిల్లీ కేంద్రీయ సమరసత కార్యదర్శి దేవ్ భాయ్ రావత్ అన్నారు. కృష్ణాజిల్లా, అవనిగడ్డ లక్ష్మీనారాయణస్వామి(గాలిగోపురం) ప్రాంగణంలో హిందూ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందువులంతా ఐక్యంగా ఉండాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మత మార్పిడి నిరోధానికి అందరూ కలిసి కట్టుగా పని చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తూర్పు వీహెచ్‌పీ విభాగ ప్రాంత ఉపాధ్యక్షుడు పల్నాటి వెంకటస్వామి నాయుడు, జిల్లా అధ్యక్షుడు బూరగడ్డ శ్రీనాథ్, రఘుశేఖరప్రసాద్, బసవ శంకరరావు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.





