
284views
2025 జనవరికి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్ల కోటాను ఈ నెలలో టీటీడీ అందుబాటులోకి తేనుంది. తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లకు సంబంధించి 2025 జనవరి కోటాను ఈ రోజు ఉదయం 10 గంటలకు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
ఈ సేవాటికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ ప్రకటించింది. ఈ టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 21 నుంచి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. వారికి లక్కీడిప్‌లో టికెట్లు మంజూరవుతాయి. కాగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 22న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.





