
374views
కార్తీక మాసంలో భక్తుల సౌకర్యార్థం దేవాలయాల్లో పటిష్ఠమైన ఏర్పాటు చేయాలని దేవదాయ శాఖ కమిషనర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. ఆలయాల ఈవోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భక్తులకు పంపిణీ చేసే ప్రసాదాలతో పాటు అన్నప్రసాదంలోనూ నాణ్యత పాటించాలని ఆదేశించారు. ఆలయాల బయట ఉండే దుకాణాల్లో ధరలు నియంత్రించడంతో పాటు ధరల పట్టికను కచ్చితంగా ప్రదర్శించాలని స్పష్టం చేశారు.





