News

ఆంజనేయస్వామి ఆలయాన్ని ధ్వంసం చేసిన దుండగులు

439views

హిందూ ఆలయాలపై దాడులు రోజురోజుకు పెరుగుతున్నాయి. నవరాత్రుల సందర్భంగా తెలంగాణ సహా పలు చోట్ల అమ్మవారి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. తాజాగా రాష్ట్రంలో ఓ ఆలయాన్ని దుండగులు ధ్వంసం చేశారు.

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ములకలచెరువు ప్రాంత పరిధిలోని శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయాన్ని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. పునాదులతో సహా ఆలయాన్ని పెకిలించి పడేశారు. గేట్లు ధ్వంసం చేసి ఆలయాన్ని ఓ వైపు నెట్టేశారు.

విషయం తెలుసుకున్న స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

దాడి ఘటనపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమగ్ర విచారణ జరిపి దాడికి పాల్పడిన వ్యక్తులను వెంటనే గుర్తించి శిక్షపడేలా చూడాలని పోలీసులను ఆదేశించారు.