News

శబరిమలకు ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు

437views

అయ్యప్ప భక్తులకు ఆర్టీసీ శుభవార్త చెప్పింది. శబరిమలకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తూ.. 5, 6, 7 రోజుల ప్యాకేజీ ప్రకటించింది. ఈ మేరకు గుంటూరు జిల్లా ప్రజా రవాణా అధికారి అప్పలరాజు ఈ వివరాలు వెల్లడించారు. అయ్యప్ప మాలధారుల కోసం ఇంద్ర, సూపర్‌ లగ్జరీ, అల్ట్రా డీలక్స్‌ బస్సులు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. విశాఖ జిల్లాతో పాటు ఒడిశాలోని నౌరంగపూర్‌, కోరాపుట్‌, జైపూర్‌ ప్రాంతాల భక్తులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు.

ఐదు రోజుల యాత్ర

విశాఖలో బయలుదేరి విజయవాడ, మేల్‌ మరవత్తూర్‌, ఎరుమేలి, పంబ, స్వామి సన్నిధానం చేరుకుంటుంది. దిగువ ప్రయాణంలో శ్రీపురం, కాణిపాకం, తిరుపతి, విజయవాడ మీదుగా విశాఖపట్నం చేరుకోవడంతో ఈ యాత్ర ముగుస్తుంది. ప్రయాణ చార్జీలు ఒక్కరికి సూపర్‌ లగ్జరీ రూ.6,600, అల్ట్రా డీలక్స్‌ రూ.6,600, ఇంద్ర రూ.8,500.

ఆరు రోజుల యాత్ర

విశాఖలో బయలుదేరి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేళి, పంబ, సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, అన్నవరం మీదుగా విశాఖపట్నం చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ప్రయాణ చార్జీలు ఒక్కరికి సూపర్‌ లగ్జరీ రూ.7 వేలు, అల్ట్రా డీలక్స్‌, రూ.7 వేలు, ఇంద్ర, రూ.9 వేలు.

ఏడు రోజుల యాత్ర

విశాఖలో బయలుదేరి విజయవాడ, కాణిపాకం, శ్రీపురం, భవాని, పళని, ఎరుమేలి, పంబ, సన్నిధానం చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మధురై, రామేశ్వరం, తిరుపతి, శ్రీకాళహస్తి, విజయవాడ, ద్వారపూడి, అన్నవరం మీదుగా విశాఖపట్నం చేరుకోవడంతో ముగుస్తుంది. ప్రయాణ చార్జీలు ఒక్కరికి సూపర్‌ లగ్జరీ రూ.7,600, అల్ట్రా డీలక్స్‌ రూ.7,600, ఇంద్ర రూ.10 వేలు.

మరిన్ని వివరాలకు సంప్రదించాల్సి నంబర్లు

విశాఖ డిపో అసిస్టెంట్‌ మేనేజర్‌(ట్రాఫిక్‌) 90522 27083

విశాఖపట్నం డిపో మేనేజర్‌ 99592 25594

ద్వారకా బస్టేషన్‌ ఏటీఎం 91001 09731

కో–ఆర్డినేటర్‌ పీవీఎన్‌ రావు 73829 14219