News

‘శ్రీవారి’ పాదయాత్రికుడికి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు

300views

అందరూ బాగుండాలి అన్న నినాదంతో తిరుపతి జిల్లా కొత్తగూడేనికి చెందిన త్రివేణి-కృష్ణవేణి విద్యాసంస్థల అధినేత జి.వీరేంద్రచౌదరి భద్రాచలం నుంచి తిరుమలకు చేపట్టిన పాద యాత్రకు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లభించింది. ఈ మేరకు ఏడో యాత్ర ముగింపు సందర్భంగా ప్రెస్ క్లబ్లో ఆయనకు ఇండియా బుక్ ఆఫ్ రికార్స్ సంస్థ ప్రతినిధి డాక్టర్ పుష్కర్ కుమరం మెడల్, నమోదు పత్రాలను అందించారు. డాక్టర్ పుష్కర్ కుమరం మాట్లా డుతూ సమాజహితం కోరుతూ ఏడు పర్యాయాలు భద్రాచలం నుంచి తిరుమలకు 19 రోజుల్లో 619 కిలోమీటర్లు స్పీడ్ వాక్ చేయడాన్ని గుర్తించి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ స్థానం కల్పించినట్టు తెలిపారు. వీరేంద్రచౌదరి మాట్లాడుతూ 2004లో తమ పాదయాత్రను భద్రాచలం రామాలయం నుంచి తిరుమల శ్రీవారి ఆలయం వరకు 11 మందితో చేపట్టి నట్టు తెలిపారు. ఇలా ప్రతి లీపు సంవత్సరంలో యాత్రతో ఏడు సార్లు పాదయాత్రను చేపట్టినట్టు చెప్పారు. మొన్న చేపట్టిన ఏడో పాదయాత్ర ముగింపుతో శ్రీవారిని దర్శించుకుని టీటీడీ నిత్య అన్నదానం ట్రస్ట్కు రూ.10 లక్షలు విరాళం ఇచ్చినట్టు తెలిపారు.