
289views
బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా 2021లో జేశోరేశ్వరి కాళీమాత ఆలయానికి ప్రధాని మోదీ బహూకరించిన కిరీటం చోరీకి గురైంది. దీనిపై తాజాగా బంగ్లాదేశ్‌లోని భారత హైకమిషన్ స్పందించింది. నిందితులను వెంటనే పట్టుకుని శిక్షించాలని కోరింది. ‘‘కిరీటం చోరీ వార్తలు మా దృష్టికి వచ్చాయి. బంగ్లా ప్రభుత్వం దీనిపై విచారణ జరిపించి కిరీటాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవాలని, దొంగలను శిక్షించాలని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని దౌత్య కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్టు పెట్టింది. బంగ్లాలోని సత్ఖీరా జిల్లా ఈశ్వరీపుర్‌లోని ఈ కాళీ ఆలయం 51 శక్తి పీఠాల్లో ఒకటి.





