News

దత్తాత్రేయ హోసబళేతో భేటీ అయ్యారని ఏడీజీపీపై కక్ష

244views

కేరళలోని వామపక్ష ప్రభుత్వం సీనియర్ ఐపీఎస్ అధికారి, ఏడీజీపీ అజిత్ కుమార్ ను టార్గెట్ చేసింది. అనధికారికంగా ఆయన ఆరెస్సెస్ సర్ కార్యవాహ దత్తాత్రేయ హెసబళేతో భేటీ అయ్యారు. ఈ కారణంగానే వామపక్ష ప్రభుత్వం ఆయన్ను టార్గెట్ చేసింది. అంతేకాకుండా ఆయనపై క్రమశిక్షణా చర్యలకు కూడా ఉపక్రమించింది. దీనికి సంబంధించిన ఫైల్ సీఎం పినరయ్ వద్దకు కూడా చేరిపోయింది. ఇందులో ఆయనపై చాలా పెద్ద ఆరోపణలే చేసింది. ఆరెస్సెస్ సర్ కార్యవాహ్ దత్తాత్రేయ హోసబళేతో ఏడీజీపీ అజిత్ భేటీ అయినట్లు పేర్కొన్నారు.

అయితే ఈ నివేదికను డీజీపీ సీఎం పినరయ్ కి నివేదించిన తర్వాత ఏడీజీపీగా అజిత్ ను తొలగించేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. తొలగించిన తర్వాత ఆయనపై చర్యలు తీసుకోనున్నారు.నిజానికి ఏడీజీపీ అజిత్ కుమార్ పై సీపీఎం ఎమ్మెల్యే పీవీ అన్వర్ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు తర్వాతే ఏడీజీపీపై చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. నిజానికి మే 22,2023 తేదీన దత్తాత్రేయ హోసబళేతో ఏడీజీపీ అజిత్ అనధికారికంగా భేటీ అయ్యారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో విజయన్ సర్కార్ ఇప్పుడు చర్యలకు రంగం సిద్ధం చేసింది.