
336views
నవరాత్రుల సందర్భంగా ఢిల్లీలో ఆందోళనకరమైన వార్త వెలుగులోకి వచ్చింది. తిస్ హజారీ ప్రాంతంలో ఝండేవాలా దేవి మందిర్ నుంచి పవిత్ర జ్యోతిని తీసుకెళ్తున్న సమయంలో ఇస్లాం ఛాందసులు జ్యోతిపై మాంసం ముక్కలు విసిరారు. ఈ చర్య సనాతన ధర్మానికి, అమ్మ వారికి అవమానకరమని, పవిత్ర సంప్రదాయంపై దాడులు జరిగాయని హిందువులు మండిపడ్డారు.ఈ ప్రాంతంలో చాలా సంవత్సరాలుగా దేవీ నవరాత్రుల సమయంలో పవిత్రమైన జ్యోతిని తీసుకెళ్లడం, ఆలయాలను సందర్శించడం ఆనవాయితీగా వస్తోంది. దేవాలయ సందర్శన అనంతరం భక్తులందరూ ఈ జ్యోతులను తమ ఇంటికి తీసుకెళ్తారు. ఝండేవాలా మందిరం నుంచి జ్యోతిని తమ ఇళ్లకు చేరుతున్న సమయంలోనే దుండగులు జ్యోతిపై మాంసం ముక్కలు విసిరారు.





