News

ఆధ్యాత్మికతతోనే మానసిక ప్రశాంతత

355views

ఆధ్యాత్మికత అలవర్చుకోవడం ద్వారానే మానసిక ప్రశాంతత చేకూరుతుందని కడప చిన్మయ మిషన్‌న్‌ అధ్యక్షుడు తురియానంద సరస్వతి అన్నారు.అన్నమయ్య జిల్లా రాయచోటిలోని స్థానిక సాయి ఇంజినీరింగ్‌ కళాశాలలో కడప చిన్మయ మిషన్‌ ఆధ్వర్యంలో ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియన్స్‌ టు ట్రాన్స్‌ఫార్మింగ్‌ ఇండియా అంశంపై ఆధ్యాత్మిక ప్రవచన కార్యక్రమాన్ని నిర్వహంచారు. ఈ సందర్భంగా తురియానంద సరస్వతి మాట్లాడుతూ మానవ జన్మను ఆధ్యాత్మిక చింతనతోనే సార్థకత చేసుకోవాలన్నారు. నేటి సమాజంలో మనుషుల నడుమ అభిమానం, ఆప్యాయత సన్నగిల్లుతున్నాయన్నారు. సాటి మనిషిని ప్రేమించలేని స్థితిలో మనుషులు మనుగడ సాధిస్తున్నారన్నారు. అన్నిమతాల కలయికే విశ్వమతం అని, భారతదేశం ప్రపంచానికే ఆధ్యాత్మిక కేంద్రంగా బాసిల్లుతోందని అభిప్రాయపడ్డారు. ఆధ్యాత్మికత ద్వారా మానవునిలో శాంతి, సహనం అలవడి తద్వారా సుఖశాంతులతో జీవించ గలుగుతారని వివరించారు.