News

శాఖల కార్యక్రమాలను మెరుగుపరచడంపై బైఠక్‌లో చర్చిస్తాం : సునీల్ అంబేకర్

376views

శాఖల కార్యక్రమాలను మెరుగుపరచడం, నూతన ఆటల ప్రయోగంపై బైఠక్‌లో చర్చిస్తామని రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ తెలిపారు.జరగనున్న అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ గురించి ఝార్ఖండ్ లోని రాంచిలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, సంఘ పని దృష్టికోణంలో కార్యవిభాగాల పై చర్చ ఉంటుందని, సంఘలో శారీరిక్, బౌద్ధిక్ విభాగాలకు సంబంధించి ఏవైతే శాఖా కార్యక్రమాలు ఉన్నాయో..వాటి పురోగతిపై చర్చిస్తామని తెలిపారు. అలాగే సేవా విభాగానికి సంబంధించి, దేశ వ్యాప్తంగా సేవా కార్యక్రమాలకు సంబంధించి శిక్షణ ఉంటుందని చెప్పారు.శాఖలోని సేవా విభాగం ద్వారా ఆయా ప్రాంతాలకు ఎలా చేరాలనే దిశగా చర్చించడం జరుగుతుంది. సంఘలోని వివిధ విభాగాలు.. సంపర్క విభాగ్, ప్రచార విభాగ్ మొదలైనవి..వీటన్నింటిపై ఇక్కడ విస్తృతంగా చర్చిస్తామని తెలిపారు.