News

శాస్త్రోక్తంగా ఆలయ జీర్ణోద్ధరణ మహాసంప్రోక్షణ

229views

ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన దిగువ అహోబిలం లక్ష్మీనృసింహస్వామి ఆలయం జీర్ణోద్ధరణ అష్ట దిగ్బంధన మహా సంప్రోక్షణ శాస్త్రోక్తంగా జరుగుతోంది. గురువారం తిరువారాధన చేసి రక్షాబంధనం, కళాకర్షణం జరిపారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన యాగశాలలో ద్వార, పాలిక పూజ, సోమకుంభ, మహాకుంభ మండల స్థాపనం చేశారు. హోమ గుండాల్లో అగ్ని ప్రతిష్ఠ చేసి హోమం నిర్వహించి మహాపూర్ణాహుతి గావించారు.

వేదపండితులు వేదప్రబంధ పారాయణాలు పఠించి భక్తులకు తీర్థప్రసాదాలు అందించారు. పీఠాధిపతి రంగనాథ యతీంద్ర మహాదేశికన్ ప్రహ్లాదవరదస్వామి, శ్రీదేవి. భూదేవి అమ్మవార్లను అర్చించారు. ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను అలరించాయి. ప్రధానార్చకుడు కిడాంబి వేణుగోపాలన్, మణియార్ సౌమ్యనారాయణన్ ఆధ్వర్యంలో పూజలు చేశారు.