News

వాస్తవాధీన రేఖను గౌరవించాల్సిందే

392views

ఆస్తానా: వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను గౌరవించాల్సిందేనని చైనాకు భారత్‌ స్పష్టం చేసింది. సరిహద్దుల్లో శాంతిని నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచించింది. ఎస్‌సీవో సదస్సు సందర్భంగా ఆస్తానాలో జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ యీ గురువారం విడిగా భేటీ అయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలపై లోతుగా చర్చించారు. సరిహద్దుల్లో నెలకొన్న సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని ఇద్దరు నేతలూ తీర్మానించారు. ఇందుకోసం సైనిక, దౌత్య మార్గాల్లో ప్రయత్నాలను వేగవంతం చేసేందుకు అంగీకరించారు.