News

భక్తి ముసుగులో పాస్టర్ అసభ్య ప్రవర్తన

228views

‘జీవితం సంతోషంగా ఉండాలని మీ తరపున ప్రార్ధనలు చేస్తానని నమ్మబలికిన ఓ పాస్టర్ ఓ కుటుంబానికి దగ్గరయ్యాడు. ప్రార్ధనల పేరుతో ఇంటికెళ్తూ బాలికపై కన్నేసి తన కోర్కెను తీర్చాలంటూ వేధించాడు. చివరకు కటకటాల పాలయ్యాడు. ఈ ఘటన అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గంలో చోటు చేసుకుంది, బ్రహ్మసముద్రం మండలం చెలిమేపల్లికి చెందిన 47 ఏళ్ల పేట కొల్లప్ప అలియాస్ మాణిక్యరాజు చర్చిలో పాస్టర్గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం అతడు కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని ఓ గ్రామంలోని చర్చిలో పాస్టర్గా ఉంటూ అక్కడే నివాసముంటున్నాడు. ఇతనికి అదే గ్రామానికి కుటుంబానికి దగ్గరయ్యాడు. ఇంటికి వెళ్లి మరీ. ప్రార్ధనలు చేసేవాడు. ఆ కుటుంబంలోని బాలికపై కన్నేసి.. తరచూ ప్రార్ధనా కార్యక్రమాలకు తన వెంట తీసుకెళ్లేవాడు. అమ్మాయి తల్లిదండ్రులు సైతం నమ్మకంగా తమ కుమార్తెను అతని వెంట పంపేవారు. గత నెల 29న పాఠశాలకు వెళ్తున్న బాలికను నిందితుడు.. విజయవాడ వద్ద ప్రార్ధనలు ఉన్నాయంటూ నమ్మించాడు. కారులో బళ్లారి మీదుగా విజయవాడకు తీసుకెళ్లాడు.. మరుసటి రోజు ఏలూరు వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో బాలికను నిర్బందించాడు. ఎలాంటి ప్రార్థనలకు తీసుకెళ్లలేదు. తన కోరిక తీర్చాలంటూ వేధింస్తూ అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ససేమిరా అనడంతో భయపడిన పాస్టర్.. అమ్మాయిని తిరిగి గురువారం ఏలూరు నుంచి తీసుకొచ్చి ఆమె సొంతూరిలో వదిలిపెట్టి వెళ్లాడు. అప్పటికే కుమార్తె ఆచూకీ కోసం గాలించిన తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఇంటికొచ్చిన బాధిత బాలిక జరిగిన విషయం తల్లిదండ్రులకు వివరించింది. పోలీసులు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశారు. పాస్టర్గా ఉంటూ ప్రార్థనలతో సాంత్వన కల్గిస్తానని కొందరు భక్తులను మోసగించి బంగారు ఆభరణాలు, నగదు దోచుకున్నట్లు ఫిర్యాదులున్నాయి.