News

9న శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

242views

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో ఈనెల 9న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఈనెల 16న ఆణివార ఆస్థానం నిర్వహించనున్న నేపథ్యంలో కార్యక్రమం చేపట్టనున్నారు. ఆరోజున ఉదయం ఆరు గంటలకు ప్రారంభమయ్యే తిరుమంజనం సుమారు 5 గంటలపాటు కొనసాగనుంది. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు ఆగమోక్తంగా పూజాదికాలు చేపడుతారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తారు. తిరుమంజనం కారణంగా మంగళవారం నిర్వహించే అష్టదళపాదపద్మారాధన సేవను తితిదే రద్దుచేసింది.