News

ఘనంగా ఆదిశంకరాచార్య జయంతి

285views

ఇంద్రకీలాద్రి శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం కొలువైన ఇంద్రకీలాద్రిపై జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య జయంతిని ఆదివారం ఘనంగా నిర్వహించారు. అమ్మ వారి ఆలయ ప్రాంగణంలోని చిన్న గాలిగోపురం ఆవరణలో ఉన్న లక్ష్మీగణపతి స్వామి వారి మందిరం వద్ద ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. తొలుత ఆలయ అర్చకులు ఆది శంకరాచార్య విగ్రహానికి పంచామృతాలతో అభిషేకాలు, శంకర పూజ, యతి వందనం జరిపించారు. పూజా కార్యక్రమాల్లో ఆలయ ఈఓ కె.ఎస్. రామరావు పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్య శివప్రసాద్ శర్మ పర్యవేక్షణలో వైదిక కమిటీ సభ్యులు యజ్ఞనారాయణమూర్తి, కోట ప్రసాద్, శంకర శాండిల్య, రంగావజ్ఞుల శ్రీనివాసశాస్త్రి పూజా కార్యక్ర మాలను ఘనంగా నిర్వహించారు. చింతలపాటి ఆంజనేయ ఘనా పాటి, పురాణ పండిత్ చింతలపాటి వెంకటేశ్వర శర్మలు ఆది శంకరాచార్యుల వైశిష్ట్యం గురించి భక్తులకు వివరించారు. సాయంత్రం నగరోత్సవాన్ని నిర్వహించగా, మహా మండపం నుంచి ఊరేగింపు ప్రారంభమైంది. మహా మండపం నుంచి కనకదుర్గనగర్, రథం సెంటర్, కెనాల్ రోడ్డు వినాయకుడి గుడి, రథం సెంటర్, ఘాట్ రోడ్డు మీదుగా అమ్మవారి ఆలయానికి చేరింది. నగరోత్సవంలో ఆలయ అధికారులు, భక్తులు, సిబ్బంది పాల్గొన్నారు.