News

సూర్యుడి ఉపరితలంపై విస్పోటనాలు

262views

సూర్యుడి ఉపరితలంలో సంభవించిన రెండు విస్పోటనాలు సౌర జ్వాలను అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసాకు చెందిన సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ చిత్రాలను బంధించింది. ఎక్స్‌ వేదికగా వాటిని నాసా విడుదల చేసింది. సూర్యుడి ఉపరితలంపై శుక్ శనివారాల్లో విస్పోటనాలు జరిగాయని, దాంతో పెద్ద ఎత్తున సౌర తుఫాను ఎగిసిపడగా భూమిని తాకినట్లుగా తెలిపింది.

సూర్యుడి ఉపరితలంపై తొలి విస్పోటనం ఈ నెల 10న అమెరికా కాలమానం ప్రకారం రాత్రి 9.23 గంటలకు జరిగింది. రెండో విస్పోటనం 11న ఉదయం 7.44 గంటలకు జరిగింది. వాటి తీవ్రత ఎక్స్‌ 5.8, ఎక్స్‌1.5గా ఉందని.. ఆ దృశ్యాలను సోలార్ డైనమిక్స్ అబ్జర్వేటరీ ఫొటోలు క్లిక్‌మనిపించిందని నాసా పేర్కొంది. సౌర తుఫానులు శుక్రవారం భూమిని తాకగా.. ఖగోళకాంతి ఆకాశంలో కనిపించింది. ఈ అరుదైన దృగ్విషయం ఉత్తర ఐరోపా, ఆస్ట్రేలియాలోని టాస్మానియాతో సహా వివిధ ప్రదేశాల్లో రాత్రిపూట ఆకాశం గులాబీ, ఆకుపచ్చ, ఊదారంగులతో కనిపించాయి. సౌర తుఫానులు భూమిని తాకడంతో నేషనల్‌ నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది.