షిల్లాంగ్ రామకృష్ణ ఆశ్రమంలో ఒకరోజు ఆసక్తికరమైన సంఘటన జరిగింది. మఠానికి ఆనుకొని ఓ కుటుంబం ఉండేది. ఓ రోజు సాధు బృందమంతా రాత్రి భోజనం చేస్తున్న సమయంలో హఠాత్తుగా పక్కింటి పెద్దాయన ప్రత్యక్షమయ్యాడు. స్వాములందరూ ఆశ్చర్యపోయారు. అప్పుడా గృహస్థు ‘క్షమించండి! స్వామీజీ ఇలా రావటం పొరపాటే! కానీ మా ఆవిడతో చిన్న వివాదం తలెత్తింది. అందుకే ఇలా వచ్చాను!’ అని వివరించాడు. ‘ఏమిటది?’ ఆశ్చర్యంగా ప్రశ్నించారు స్వామీజీలు. ‘మీ భోజనాల గదికి కొన్ని అడుగుల దూరంలోనే మా ఇల్లు ఉన్నందున మీ మాటలన్నీ వినిపిస్తుంటాయి. మీరంతా తినేటప్పుడు చాలా సరదాగా మాట్లాడుతుంటారు. ఆ నవ్వులు, కోలాహాలు విని మా ఆవిడ ‘స్వామీజీలు రుచికరమైన అనేక వంటలతో భోజనం చేస్తుంటారేమో! అందుకే వాళ్లు చాలా ఉల్లాసంగా ఉంటారు’ అంటుంటుంది. నేనేమో ‘లేదు! ఆశ్రమం ఆర్థికంగా అంత మంచి స్థితిలో లేదు. అన్ని రకాల వంటలు చేసుకునే అవకాశం లేదు. అలాంటప్పుడు స్వామీజీలు అద్భుతమైన పదార్థాలు ఎలా తినగలరు? వాళ్ల తత్త్వం అలాంటిది. సహజంగానే సంతోషంగా ఉంటారు’- అని చెబుతుంటాను. కానీ మా ఆవిడ నా మాటలను అంగీకరించటం లేదు. అందువల్ల నేను స్వయంగా చూసి తెలుసుకొని, నా భార్యకి అసలు సంగతేమిటో చెబుతామని వచ్చాను’ అన్నాడు. అప్పుడు స్వామీజీలందరూ మరింత ఉల్లాసంగా ఆయనను కూడా తమతో కలిసి తినమని ఆహ్వానించి, తమతో పాటు సాధారణ భోజనమే వడ్డించారు. ‘ఆనందం అనేది పరిస్థితుల్లో, పదార్థాల్లో ఉండదు. మన మనసులో ఉండాలి. ఆధ్యాత్మికతకు అదే ఆనవాలు’ అని నిరూపించారు. భర్త అనుభవపూర్వకంగా చూసి చెప్పగా.. ఆ గృహణికి విషయం బోధపడింది. అప్పటి నుంచి ప్రత్యేక దినాల్లో స్వయంగా తనే మిఠాయిలు, ఇతర ప్రత్యేక వంటకాలు తయారు చేసి ఆశ్రమానికి పంపిస్తుండేది.
257views
You Might Also Like
నక్సల్స్ ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి.. తిరిగి వచ్చేస్తున్న ప్రజలు
28
కేంద్ర ప్రభుత్వం ‘‘ఆపరేషన్ కగార్’’ తో నక్సలిజం కకావికలమైంది. చాలా మంది నక్సల్స్ అగ్రనేతలు ఎన్ కౌంటర్ లో హతమయ్యారు. మరి కొందరు లొంగిపోయారు. మిగిలిన నక్సల్స్...
‘‘ఖారిజీ మదర్సా’’ దృష్టి పెట్టిన బెంగాల్ సర్కార్
41
బెంగాల్ సర్కార్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ గుర్తింపు లేని మదర్సాలపై దృష్టి నిలిపింది. ఇందులో భాగంగా ఆ మదర్సాలలో విస్తృత తనిఖీలు నిర్వహిస్తోంది. అసలు అవి ఎలా...
కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఎనిమిది గుణాలు అవసరం : రవీంద్ర జోషి
36
కుటుంబ వ్యవస్థ, కుటుంబ విలువల కారణంగానే భారతీయ సంస్కృతి ఇప్పటికీ సురక్షితంగానే వుందని అఖిల భారతీయ కుటుంబ ప్రబోధన్ సంయోజక్ రవీంద్ర జోషి అన్నారు. భారత్ లో...
“మా DNA, భారతదేశ DNA ఒక్కటే”.. భారత్‌తో చారిత్రక బంధాన్ని గుర్తుచేసిన తాలిబాన్ మంత్రి
36
న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్తాన్లోని తాలిబాన్ ప్రభుత్వ వ్యవసాయ, నీటిపారుదల, పశుసంవర్ధక శాఖ మంత్రి మౌలానా అతావుల్లా ఒమారీ భారత్-ఆఫ్ఘనిస్తాన్ సంబంధాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "భారతదేశం మరియు ఆఫ్ఘనిస్తాన్...
మియావాకి పద్ధతిలో మొక్కలు నాటి గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన అహ్మదాబాద్
41
పర్యావరణ పరిరక్షణలో గుజరాత్‌లోని అహ్మదాబాద్ నగరం అద్భుతమైన మైలురాయిని అధిగమించింది. భారీ స్థాయిలో నిర్వహించిన ఒక వినూత్న ప్లాంటేషన్ డ్రైవ్ ద్వారా సరికొత్త గిన్నిస్ వరల్డ్ రికార్డ్...
తిరుమల సంప్రదాయాలతో రాజకీయాలు వద్దు : డీకే శివకుమార్‌కు భానుప్రకాష్ రెడ్డి సూచన
35
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శతాబ్దాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలపై రాజకీయ వ్యాఖ్యలు చేయడం సరికాదని టీటీడీ పాలకమండలి సభ్యుడు భానుప్రకాష్ రెడ్డి స్పష్టం...





