News

వరల్డ్ ఆర్చరీలో జ్యోతి సురేఖ అద్భుత ప్రదర్శన

270views

వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీలో విజ‌య‌వాడ‌కు చెందిన జ్యోతి సురేఖ హ్యాట్రిక్ గోల్డ్ మెడ‌ల్స్ సాధించి అరుదైన ఘనత సాధించారు. త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న‌తో ఆర్చ‌రీ వ‌ర‌ల్డ్‌క‌ప్ స్టేజ్ 1 ఈవెంట్‌లో భారత్ కు ఆధిప‌త్యాన్ని తీసుకువ‌చ్చింది. వ్య‌క్తిగ‌త‌, ఉమెన్స్ కాంపౌండ్ టీమ్‌, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్స్‌ లో భాగంగా జ్యోతి సురేఖ స్వ‌ర్ణ ప‌త‌కాలు సాధించింది.

మ‌హిళ‌ల వ్య‌క్తిగ‌త కాంపౌండ్ విభాగంలో మెక్సికోకు చెందిన ఆండ్రియా బిసెర్రాపై 146-146 తేడాతో విజ‌యం సాధించారు. వ‌ర‌ల్డ్ ఆర్చ‌రీ కాంపౌండ్ క్యాట‌గిరీలో జ్యోతి సురేఖ స్వ‌ర్ణాన్ని గెలవడం ఇది మూడో‌సారి. దీపా కుమారి త‌ర్వాత ఒక వ‌ర‌ల్డ్ క‌ప్ స్టేజ్‌లో మూడు గోల్డ్ మెడ‌ల్స్ సాధించిన రెండో భార‌తీయ ఆర్చ‌ర్‌గా జ్యోతి సురేఖ రికార్డు నెలకొల్పారు.