News

పూరీ రథయాత్రలో నిస్వార్థంగా సేవలందించిన ఆరెస్సెస్ కార్యకర్తలు

24views
పూరీలో మహాప్రభు జగన్నాథ రథయాత్ర అత్యంత వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా ఆరెస్సెస్ స్వయంసేవకులు తమ నిస్వార్థ సేవను ఎప్పటిలాగే కొనసాగించారు. విస్తృతమైన సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నారు. లక్షలాది మంది భక్తుల సమక్షంలో అంబులెన్స్ ల రాకపోకలకు ఆటంకం లేకుండా మానవ హారాలను ఏర్పాటు చేశారు. దీని ద్వారా ఆరెస్సెస్ స్వయంసేవకులు రద్దీని నియంత్రించగలిగారు. అలాగే అత్యవసర సేవలలో ఆరెస్సెస్ కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు.
ఇంతటి రద్దీలో కూడా ఆరెస్సెస్ స్వయంసేవకులు అత్యంత పకడ్బందీగా, చతురతతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఇంతటి రద్దీలో కూడా అస్వస్థతకు గురైన భక్తులకు తక్షణ వైద్య కోసం సకాలంలో ఆస్పత్రులకు తరలించారు. వారి ప్రాణాలకు భరోసా కల్పించారు. ఇంతటి లక్షల మందిలో కూడా ఆరెస్సెస్ స్వయంసేవకుల అంకిత భావం, క్రమశిక్షణ అన్ని వర్గాలనూ ఆకట్టుకుంది. ప్రశంసలూ కురిపించారు.
ప్రపంచ ప్రఖ్యాత రథయాత్ర సందర్భంగా, ‘ఉత్కల్ విపన్న సహాయతా సమితి’ తన వార్షిక సేవా సంకల్పానికి అనుగుణంగా ఆర్‌ఎస్‌ఎస్ (RSS) సహకారంతో తొమ్మిది రకాల సేవా కార్యక్రమాలను నిర్వహించింది. రథయాత్ర రోజున, వివిధ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమైన స్వయంసేవకుల సమక్షంలో, సమితికి చెందిన ప్రధాన వైద్య కేంద్రంలో ఈ సేవా కార్యక్రమాలు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
సేవా కార్యక్రమాల ప్రారంభ సూచికగా జ్యోతి ప్రజ్వలన చేయడం ద్వారా, ఆర్‌ఎస్‌ఎస్ ఒడిశా పూర్వ ప్రాంత్ సంఘచాలక్ సమీర్ కుమార్ మొహంతి, క్షేత్ర సేవా ప్రముఖ్ దీపక్ కుమార్ రౌత్ మరియు కమిటీ కార్యదర్శి వి. కృష్ణ గోపాల్ ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ రథయాత్ర సందర్భంగా స్వయంసేవకులు అనేక రకాల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించారు. క్రమశిక్షణతో చేశారు. గాయపడిన, స్పృహ కోల్పోయిన భక్తులను వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి, వైద్యం అందేలా చూశారు. అలాగే భక్త జన సందోహంలో అంబులెన్స్ వెళ్లడానికి మానవ హారాలుగా నిలబడి, మార్గం సుగుమం చేశారు. అలాగే ఆస్పత్రుల్లో కూడా వైద్యులకు సమన్వయకర్తలుగా వ్యవహరించి, అవసరమైన సహాయాన్ని అందించారు.
ఈ ఏడాది, ఒడిశాలోని మొత్తం 30 జిల్లాల నుండి 1,800 మందికి పైగా స్వయంసేవకులు సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రెండు షిఫ్టుల్లో అంబులెన్స్ సేవల్లో పాల్గొన్నారు. అలాగే భక్తులకు నిర్ణీత ప్రదేశాలలో మంచి నీటిని పంపిణీ చేశారు స్వయంసేవకులు.ప్రత్యేక బృందాలు స్ట్రెచర్ సేవలు మరియు ఆసుపత్రి సహాయాన్ని అందిస్తూ, రోగులకు సకాలంలో సంరక్షణ అందేలా చూశాయి. బడా దండా పొడవునా పరిశుభ్రతను కాపాడేందుకు ఒక ప్రత్యేక సిబ్బంది బృందం పనిచేశారు.
puri2
సేవా కార్యక్రమాల్లో ఆర్‌ఎస్‌ఎస్ స్వయంసేవకులతో పాటు, ‘హిందూ జాగరణ మంచ్’కు చెందిన 500 మందికి పైగా కార్యకర్తలు కూడా చురుకుగా పాల్గొన్నారు. జాతీయ సహ-సంఘటనా కార్యదర్శి దేవేంద్ర జీ, ఒడిశా ప్రాంత సంఘటనా కార్యదర్శి తన్మయ్ దాష్, ప్రాంత కన్వీనర్ రఘునాథ్ బారిక్, సహ-కన్వీనర్ ఆశిష్ బి. ఛోట్రాయ్ మరియు కార్యవర్గ సభ్యులు సుబ్రత ధల్ వంటి సీనియర్ బాధ్యులు, ఇతర కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.