News

వచ్చే ఏడాది భారత్‌కు ‘ఎస్‌-400’ గగనతల రక్షణ వ్యవస్థ

272views

రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్‌-400 ట్రైయాంఫ్‌ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. ఈ మేరకు సంబంధిత అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. ఉక్రెయిన్‌తో యుద్ధం కారణంగా సరఫరాల్లో జాప్యంతో ఈ వ్యవస్థలు మనదేశానికి అందడానికి ఆలస్యమవుతోంది. 5.5 బిలియన్‌ డాలర్ల ఒప్పందంలో భాగంగా రష్యా నుంచి ఇప్పటికే మూడు దీర్ఘశ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థలు మనదేశానికి అందాయి. మరోపక్క రష్యా తయారీ యుద్ధనౌక తుషిల్‌ ఈ ఏడాది సెప్టెంబరు నాటికి, తమల్‌ అనే మరో వార్‌షిప్‌ వచ్చే జనవరికి మనదేశానికి అందే అవకాశం ఉందని ఆ వర్గాలు తెలిపాయి. వాస్తవానికి ఈ రెండు నౌకలు 2022 నాటికే అందాల్సి ఉంది.